లాక్ డౌన్ ఎఫెక్ట్.. కల్లు దొరక్క ఆగమాగం

లాక్ డౌన్ ఎఫెక్ట్.. కల్లు దొరక్క ఆగమాగం
  • మూర్ఛ వ్యాధితో ఒకరి మృతి
  • ఫినాయిల్​ తాగి మరొకరు..

నిజామాబాద్ క్రైం, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో కల్లు దొరకట్లేదని కొందరు ఆగమాగం అవుతున్నారు. వారి ప్రవర్తన వింతగా ఉంటుంది.  జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మూర్ఛ వ్యాధితో శనివారం మృతిచెందాడు. అయితే వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతోనే అతనికి మూర్ఛ వచ్చిందని కుటుంబీకులు చెబుతున్నారు. నిజామాబాద్​లోని ముదిరాజ్​ వీధికి చెందిన భువనగిరి భూషణ్ (45)కు కృత్రిమ కల్లు అలవాటు ఉంది. లాక్​డౌన్​ నేపథ్యంలో వారం రోజులుగా జిల్లా కేంద్రంలో కల్లు దుకాణాలు బంద్​ఉన్నాయి. దీంతో మూడు రోజులుగా అతను కల్లు కావాలని పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి మూర్ఛ వచ్చి పడిపోయాడు. వెంటనే డిస్ట్రిక్ట్​ గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

కల్లు దొరకలేదని ఫినాయిల్​ తాగింది

కల్లు దొరకడం లేదని నిజామాబాద్​లోని సాయినగర్​కాలనీకి చెందిన శకుంతల(42) శుక్రవారం రాత్రి ఫినాయిల్​తాగింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది.

సీఎం రిలీఫ్ ఫండ్ కు సింగరేణి కార్మికుల విరాళం