హైదరాబాద్, వెలుగు: సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఏళ్ల తరబడి వాడటం వల్ల పూర్తి పోషక విలువలు అందడం లేదని న్యూట్రిషన్ నిపుణులు చెప్తున్నారు. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నివేదిక ప్రకారం.. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఒమెగా-6 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్యాకేజ్డ్ ఫుడ్స్ ద్వారా ఇవి ఇప్పటికే శరీరానికి ఎక్కువగా అందుతున్నాయి. ఇవి అధికమైతే బీపీ వంటివి వస్తాయి. తెలంగాణలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడకం ఎక్కువ. దీన్ని పదే పదే వేడి చేయడం వల్ల పోషక విలువలు తొలగిపోతాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ ఈ ఉంటుంది. ఆవనూనెలో ఒమెగా-3, తవుడు నూనెలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పదార్థాలు ఉంటాయి. ఒకే నూనెకు బదులు పలు నూనెలను కలిపిన బ్లెండెడ్ ఆయిల్స్ వాడాలి.
