జ్యోతిష్యం : మిథునరాశిలో మూడు గ్రహాలు.. ఆరు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

జ్యోతిష్యం :  మిథునరాశిలో మూడు గ్రహాలు.. ఆరు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.  ప్రస్తుతం మిథున రాశిలో గురుడు.. శుక్రుడు కలిసి సంచరిస్తున్నారు.  వీటికి తోడుగా అదే రాశిలోకి బుధ గ్రహం కూడా వచ్చింది.  ఈ మూడు గ్రహాలు కలిసి సంచరించడంంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపుతుడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .

 శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధుల మధ్య సంబంధం ఏర్పడి నప్పుడు కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉచ్ఛ స్థితికి చేరుకుంటుంది. లాటరీ లేదా జాక్ పాట్ కొట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపించడం వంటివి జరుగుతాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారు అపార ధన లాభం పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

వృషభరాశి:  ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.  మిథున రాశిలో మూడు గ్రహాల మధ్య సంబంధం ఏర్పడటం.. శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

మిథునరాశి: ఇదే రాశిలో రాశిలో గురుడు, బుధుడు, శుక్రుడు సంచారంఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి.  ఈ రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కన్యారాశి: రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో సంచారం, దశమంలో శుక్ర, గురువులు ఉండటం వలన  సంపన్నులయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి  ఆకస్మిక ధన లాభం వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

తులారాశి:  ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది.  ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.  వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

మకరరాశి: గురుడు.. బుధుడు.. శుక్రుడు కలిసి మిధునరాశిలో సంచారం వలన ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా  విజయవంతం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.  రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా  పరిష్కారమవుతాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి.  ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి  బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

కుంభరాశి:   బుధుడు, గురుడు, శుక్రుడు కలిసి సంచరించడం వలన ఈ రాశి వారికి  ధనాదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి.కొంతకాలంగా ఆగిపోయిన పనుల్లో కదలిక ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్​ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది. టెక్నికల్​ రంగంలో ఉన్న వారు కొత్త ప్రాజెక్ట్​ లు చేపడతారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.