జనగామ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆలయ కోనేటిలో అర్చకులైన తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. 2026 మే 22న లింగాల ఘనపూర్ మండలం బండ్లగూడెం గ్రామంలోనీ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలోఉన్న కోనేటి గుండంలో నుంచి మృతదేమాలను వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రధాన అర్చకులు వారాయేరు లక్ష్మీనరసింహ చార్యులు, కుమారుడు పవన్ కుమార్ చార్యుల ఆలయ గుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీయించారు.
అర్చక తండ్రీ కొడుకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులను, సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
