IPL 2026: ఉప్పల్‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్.. ఆర్సీబీలో కీలక మార్పు

IPL 2026: ఉప్పల్‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్.. ఆర్సీబీలో కీలక మార్పు

ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 22) ఆర్సీబీ, ఎస్ఆర్‎హెచ్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‎లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీని తొలుత బౌలింగ్‎కు ఆహ్వానించాడు. 

అతిథ్య హైదరాబాద్ సేమ్ టీమ్‎తో బరిలోకి దిగగా.. ఆర్సీబీ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా పంజాబ్‎తో మ్యాచుకు దూరమైన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఈ మ్యాచులో తిరిగివచ్చాడు. గాయం కారణంగా జాకబ్ బెథేల్ జట్టుకు దూరమయ్యాడు. 

పాయింట్ల పట్టికలో ఫస్ట్, థర్డ్ ప్లేసుల్లో ఉన్న ఆర్సీబీ, ఎస్ఆర్‎హెచ్ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్‎లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్ 2లో చోటు దక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): 

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్