టీ తాగని వారు ఎవరైనా ఉంటారా..? రోజుకు మూడు పూటలు.. కనీసం ఒకసారైనా టీ తాగకుండా ఉండే వాళ్లు దాదాపు ఉండరనే చెప్పాలి. అయితే వద్దనుకునే వారు కూడా కనీసం షుగర్ లెస్ అయినా తాగుదాం అనుకుంటారు. చక్కెర లేకుండా టీ తాగితే చాలా వరకు డయాబెటిస్ లాంటి వ్యాధులకు దూరం ఉండవచ్చు అనే ధోరణి కొందరిలో ఉంటుంది. కానీ . అదంతా భ్రమ మాత్రమేననంటున్నారు ముంబై సైఫీ హాస్పిటల్ వైద్యులు. చిన్న రవ్వంత చక్కెర వేసుకోకుండా తాగినా డయాబెటిస్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు.
టీ కాఫీల్లో చక్కెర లేకుండా తాగడం వలన డయాబెటిస్ ముప్పు ఉండదు అనుకోవడం సహజం. చక్కెర వాడకాన్ని తగ్గించడం వలన కొంత ఉపయోగం ఉండవచ్చు కానీ.. ఇతర రోజూవారి అలవాట్లు చక్కెర వ్యాధికి దారితీసే అవకాశం ఉంది కదా అని అంటున్నారు. డయాబెటిస్ అంటే కేవలం షుగర్ తో వచ్చేదే కాదని.. లైఫ్ లో మనం ఎలా ఉంటాం.. ఎలా మెయింటైన్ చేస్తాం.. డైలీ రొటీన్ ఎలా ఉంది.. ఎంత సేపు కూర్చుంటాం.. ఎంత సేపు పడుకుంటాం.. ఎంత స్ట్రెస్ ఉంది.. అనే అంశాలపై ఆధారపడి డయాబెటిస్ ఉంటుందని చెబుతున్నారు. కేవలం చక్కెర తగ్గించి సేఫ్ అనుకుంటే అదొక్కటే కాపాడలేదని అంటున్నారు.
8 గంటల డ్యూటీతో పెద్ద ముప్పు:
ఏదైనా కార్పోరేట్ లేదా మీడియా ఆఫీసుల్లో చూస్తే ఉద్యోగుల పనివిధానం ఎలా ఉంటుందో తెలుస్తుంది. వరుసగా క్యాబిన్లు.. ఫ్లోరంతా టేబుల్స్. చైర్లతో ఉద్యోగులు పనిచేస్తుండటం చూడవచ్చు. చైర్ లో కూర్చుని నడుము కుర్చీకి ఆనించి.. కాళ్లు ముడుచుకుని కూర్చుని.. గంటల తరబడి పనిచేయడం పరిపాటి. రీసర్చ్ రొపోర్ట్ ప్రకారం.. కూర్చుని పనిచేసే క్రమంలో ఒక్కో గంట డయాబెటిస్ 22 శాతానికి పైగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
గంటల తరబడి పనిచేయడం వలన బ్లడ్ షుగర్ పెరగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే కూర్చుని పనిచేయడం వలన కండరాళ్లు కదలవు.. దాంతో గ్లూకోజ్ ను తీసుకోవు. కానీ ప్లీహం కంటిన్యూగా ఇన్సులిన్ ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతుంటుంది. దీంతో మెళ్లగా డయాబెటిస్ బారిన పడటం జరుగుతుంది.. అంటూ ఆందోళన కరమైన విషయాలు వెల్లడించారు డాక్టర్లు.
ALSO READ : అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిచ్చే సూపర్ ఫుడ్!
కూర్చుని పనిచేయడం.. పొగతాగడం ఒకటే..
నిశ్చలంగా.. కదలకుండా ఉండే లైఫ్ స్టైల్ కారణంగా రోగాలు పెరగటం జరుగుతుందని చెబుతున్నారు. డయాబెటిస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయన్నారు. డెస్క్ దగ్గర కూర్చుని పనిచేయడం.. స్మోకింగ్ చేయడానికి సమానమైన సమస్యను తెచ్చిపెడుతుందంటున్నారు. డెస్క్ వర్క్ లో ఎక్కువ సేపు కోర్చోకుండా.. బాడీకి మూవ్ మెంట్స్ ఇస్తూ మేనేజ్ చేయగల్గినా.. నిద్ర లేమి అనేది మరో థ్రెట్ అని చెబుతున్నారు. నిద్ర సరిపోకపోవడం కూడా తొందరగా దయాబెటిస్ వచ్చేందుకు కారణం అవుతుందంటున్నారు.
స్ట్రెస్ = కార్టిసాల్
ఇక స్ట్రెస్.. ఎక్కువగా ఉంటే రక్త ప్రవాహంలోకి కార్టిసాల్ దారపోసినట్లేనని అంటున్నారు. కార్టిసాల్ అనేది అడ్రినల్ గ్రంధి రిలీజ్ చేసే ఒక హార్మోన్. ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్, రోగనిరోధక శక్తి, బాడీలో శక్తి మార్పిడి.. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాల్స్ గ్లూకోజ్ రూపంలోకి మారే ప్రక్రియ. వీటిలో కార్టిసాల్ తోడ్పడుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీంతో బరువు పెరగటం, ఆందోళన, హై బీపీ, ఒత్తిడి, నిద్ర లేకపోవడం.. లాంటి ఎన్నో సైమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ కారణంగా డయాబెటిస్ పెరిగే ఛాన్స్ కూడా అధికంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తు్న్నారు.
సో.. కేవలం చక్కెరను అవాయిడ్ చేసినంత మాత్రాన డయాబెటిస్ ముప్పును తప్పించుకోలేరని.. డైలీ రొటీన్ అలవాట్లు, పనులు, నిద్ర, స్ట్రెస్ మొదలైన వాటి వలన కూడా ముప్పు ఉంటుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి నిద్ర, ఒత్తిడి లేకపోవడం, ఒకే చోట కూర్చుని పనిచేయడాన్ని తగ్గించడం.. మొదలైనవి తప్పనిసరి అంటున్నారు.
