సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి పుట్టుకతోనే ధనవంతులు అయ్యే అదృష్టం ఉంటుంది. వీరు వాళ్ళ తెలివితేటలు, అదృష్టం, కష్టపడే గుణంతో చాలా సులభంగా డబ్బును, సంపదను సంపాదిస్తారు. మరి ఆ లక్కీ నంబర్లు ఏంటో, వాటిలో మీ నంబర్ ఉందో లేదో ఇప్పుడు చూద్దామా....
డబ్బు సంపాదించడంలో దిట్ట
పుట్టిన తేదీలు: ఏ నెలలోనైనా 1, 10, 19, లేదా 28వ తేదీల్లో జన్మించిన వారి నంబర్ 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
ప్రత్యేకత: సూర్యుని ప్రభావం వల్ల వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వ్యాపారంలో, డబ్బు సంపాదించడంలో వీరు దిట్ట. వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు వ్యాపారం, మేనేజ్‌మెంట్ అండ్ రాజకీయాల్లో పెద్ద పదవులను అందుకోవడమే కాకుండా, విపరీతంగా డబ్బు సంపాదిస్తారు.
విలాసవంతమైన జీవితం, లగ్జరీ లైఫ్
ఏ నెలలోనైనా 6, 15, లేదా 24వ తేదీల్లో జన్మించిన వారి నంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు.
ప్రత్యేకత: శుక్ర గ్రహం అంటేనే సుఖ: సంతోషాలు, సంపదకు గుర్తు. ఈ నంబర్ ఉన్నవారికి డబ్బు దానంతట అదే వస్తుంది. వీరు జీవితంలో ఎప్పుడూ పైసా ఇబ్బంది పడరు. శుక్రుని అనుగ్రహం వల్ల కార్లు, బంగళాలు వంటి అన్ని రకాల విలాసాలతో చాలా లగ్జరీ లైఫ్ గడుపుతారు.
తెలివైన పెట్టుబడులు, వ్యాపారంలో రారాజులు
ఏ నెలలోనైనా 5, 14, లేదా 23వ తేదీల్లో జన్మించిన వారి నంబర్ 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు.
ప్రత్యేకత: బుధ గ్రహం తెలివితేటలకు, మంచి ఆలోచనలకు ప్రతీక. ఈ ప్రభావంతో వీరు చాలా చురుగ్గా, కష్టపడి పనిచేసే స్వభావంతో ఉంటారు. వారి దగ్గర ఉన్న డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వీరికి బాగా తెలుసు. బిజినెస్‌లో ఇంకా స్టాక్ మార్కెట్‌లో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా పక్కాగా ఉంటాయి. వీరి టాలెంట్‌తో సంపద వీరిని వెతుక్కుంటూ వస్తుంది.
ఆలస్యమైనా అద్భుత విజయం
ఏ నెలలోనైనా 8, 17, లేదా 26వ తేదీల్లో జన్మించిన వారి నంబర్ 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని దేవుడు.
ప్రత్యేకత: శని గ్రహం క్రమశిక్షణకు, కష్టపడే తత్వానికి గుర్తు. ఈ నంబర్ ఉన్నవారు జీవితం మొదట్లో కొంచెం కష్టాలు పడిన.. ఆ తర్వాత ఊహించని రేంజ్‌లో సక్సెస్ అవుతారు. వీరు డబ్బు సంపాదించడంలోనే కాకుండా, వచ్చిన డబ్బును చాలా జాగ్రత్తగా దాచుకోవడంలో, మేనేజ్ చేయడంలో మంచి టాలెంట్ తో ఉంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
