రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
మానసిక రోగానికి ఓ అమెరికన్​ సొంత ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మష్రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉడకబెట్టి రక్తంలోకి ఎక్కించుకున్నడు బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం పాకిన బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి దాన్ని పోగొట్టుకోవడానికి సొంత ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని నరకం చూశాడు. తాను చేసుకున్న మందుతో ఉన్న రోగం పోవడం కాదు కదా కొత్త రోగం అంటుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రక్తమంతా పుట్టగొడుగులు పెరగడం మొదలడంతో చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. డాక్టర్ల మందులను పక్కనబెట్టి.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి (30) బైపోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మానసిక వ్యాధి)తో ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్ల దగ్గరకు పోతే మందులిచ్చారు. కానీ వాటిని పక్కనబెట్టి సొంత వైద్యం చేసుకుందామనుకున్నాడు. వెతగ్గా వెతగ్గా మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మష్రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి తెలిసింది. అవైతేనే తన రోగాన్ని నయం చేస్తాయనుకున్నాడు. వాటిని తెచ్చి నీళ్లలో బాగా ఉడకబెట్టాడు. వడబోసి ఆ నీళ్లను రక్తంలోకి ఎక్కించుకున్నాడు. రెండ్రోజుల తర్వాత లక్షణాలు రెండ్రోజుల తర్వాత విపరీతమైన లక్షణాలు మొదలయ్యాయి. విరేచనాలు, రక్తం కక్కుకోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం మొదలైంది. అతని ఫ్యామిలీ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే అతని అవయవాలు ఒక్కొక్కటిగా పని చేయడం ఆగిపోతున్నాయి. దీంతో డాక్టర్లు త్వరత్వరగా టెస్టులు చేశారు. విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. డయాలిసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి కాపాడిన్రు ఆ వ్యక్తి రక్తంలో మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మష్రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. రక్తమంతా బ్యాక్టీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాకిందని తెలుసుకున్నారు. యువకుడిని కాపాడేందుకు తొలుత డయాలిసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రక్తాన్ని శుభ్రపర్చారు. ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గడానికి యాంటీబయోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాంటీ ఫంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. అలా 22 రోజుల పాటు ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడంతో యువకుడి ప్రాణాలు నిలిచాయి. మెల్లగా ఆరోగ్యం మెరుగవుతుండటంతో అతడిని డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇవి కూడా చదవండి 20 మంది కిడ్నాపర్లు.. రూ.5 లక్షల డీల్ డేంజర్​లో అమెరికా పాలిటిక్స్ కేఆర్ఎంబీ జ్యూరిస్‌‌డిక్షన్‌‌.. వచ్చే నెలలో నోటిఫై! పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు వచ్చి ఏం చేస్తారంటే..