మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత హానికరమైన పండ్లు ఇవే

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత హానికరమైన పండ్లు ఇవే

ఆరోగ్యానికి పండ్లు మంచి మేలును చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులు మితంగా తీసుకోవాల్సిన లేదా పూర్తిగా నివారించాల్సిన నిర్దిష్ట పండ్లు ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్, డయాబెటిక్ పేషెంట్‌లు బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా రోజూ పండ్లను తినాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లోపాన్ని తీర్చడానికి పండ్లు గొప్ప ఎంపిక. కానీ ఇక్కడ మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని పండ్లలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండవలసిన పండ్ల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.

 పుచ్చకాయ

చాలా మందికి ఈ వేసవిలో అత్యంత ఇష్టమైనదిగా భావించే పుచ్చకాయ జ్యుస్ రిఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తుంది. కానీ పుచ్చకాయలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు చాలా పరిమిత పరిమాణంలో పుచ్చకాయ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

అరటిపండ్లు

అరటిపండ్లు అధిక GI స్కోర్ (62) కలిగి ఉంటాయి. బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలతో పాటు చిన్న అరటిపండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావం ఉంటుంది. టైప్ 2 మధుమేహం ఉన్నవారు అరటిపండును పెరుగులో కలుపుకోవచ్చు. రోజంతా ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉండటానికి ఇది ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

మామిడి

మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు. ఎందుకంటే దాని రుచికి అందరూ ముగ్ధులవుతారు. కానీ దీన్ని డయాబెటిక్ పేషెంట్లు కాస్త ఆలోచించి తినాలి. మామిడి పండ్లలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచడానికి కారణమవుతుంది.

అనాస పండు

పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు. ఇందులో కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి, ఆహారం తర్వాత డెజర్ట్‌గానూ దీన్ని తినవచ్చు.

లిట్చి

వేసవిలో అత్యంత ఇష్టమైన పండ్లలో లిట్చీ కూడా ఒకటి. ఈ జ్యుసీ, గుజ్జు పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు లిట్చిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.