ఈ వారం థియేటర్స్లో రానున్న క్రేజీ సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్స్లో రానున్న క్రేజీ సినిమాలు ఇవే

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొత్త కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. గత వారం అన్ని చిన్న సినిమాలి థియేటర్స్ వద్ద సందడి చేయగా.. ఏ వారం మీడియం రేంజ్ సినిమాలు ఆడియన్స్ ను అలరించనున్నాయి. మరి ఆ సినిమాలా లేంటో ఇప్పుడు తెల్సుకుందాం.

ఈ వారం ముందుగా థియేటర్స్ లోకి రానున్న సినిమా దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా వస్తన్న గ్యాంగ్ స్టార్ మూవీ కింగ్స్ అఫ్ కొత్త(kings of kota). పెన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారు అనేది చూడాలి. 

ఇక ఆగస్టు 25న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) హీరోగా వస్తున్న గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య(Sakahi vaidhya) హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. వరుణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

బెదరులంక 2012(Bedrulankga 2012).. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya gummikonda) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్స్ లోకి రానున్నాయి. కొత్త దర్శకుడు  క్లాక్స్(Clax) తెరకెక్కించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి(Neha shatty) హీరోయిన్ గా నటించింది. 2012 యుగాంతం సమయంలో బెదురులంక అనే ఊరిలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే వింత కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాపై కార్తికేయ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా కార్తికేయకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది చూడాలి. 

ఇక కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన బాయ్స్ హాస్టల్(Boys hostel) సినిమా కూడా ఆగస్టు 25నే ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో స్టార్ యాంకర్ రష్మీ(Rashmi), కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab shetty), టాలీవుడ్ దర్శకుడు తరుబ్ భాస్కర్(Tharun bhaskar) చిన్న చిన్న పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కన్నడలో సూపర్ హిట్ ఐన ఈ సినిమా తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.