V6 News

పెద్ది వాయిదాకు అసలు కారణాలివే !

పెద్ది వాయిదాకు అసలు కారణాలివే !

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ మారింది.  ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కావల్సి ఉంది.  అయితే జూన్‌‌ నెలలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌‌ బుధవారం ప్రకటించారు.  ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు తెలిపారు. 

అవుట్‌‌పుట్‌‌పై పూర్తి సంతృప్తిగా ఉన్నామని, అయితే సాంకేతికంగా ఇంకాస్త పర్ఫెక్షన్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గత కొద్దిరోజులుగా సినిమా వాయిదా పడబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పాట మినహా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయిందని రామ్ చరణ్‌‌ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో అనుకున్న డేట్‌‌కే  వస్తుందని అభిమానులు భావించారు. కానీ పర్ఫెక్షన్‌‌ కోసం పోస్ట్​పోన్‌‌ చేశారు.  

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ పాన్- ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.