రాష్ట్రంలో ఈ జిల్లాలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి

రాష్ట్రంలో ఈ జిల్లాలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి

రాష్ట్రంలో సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని.. ఆ ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.  పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారని హెల్త్ డైరెక్టర్ అన్నారు. మూడో వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన దానికన్నా 9లక్షల 50వేల వ్యాక్సిన్ డోస్‌లు అదనంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 12లక్షల మందికి సింగిల్ డోస్ ఇచ్చామన్నారు. 33లక్షల 79వేల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామని డీహెచ్ తెలిపారు.