విజయ్ విషయంలో నిజమైన ఒకేఒక్క ఎగ్జిట్ పోల్.. స్టెప్పులేసిన సర్వే సంస్థ ఓనర్ !

విజయ్ విషయంలో నిజమైన ఒకేఒక్క ఎగ్జిట్ పోల్.. స్టెప్పులేసిన సర్వే సంస్థ ఓనర్ !

చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను పక్కకు నెట్టేసి తమిళనాడులో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. తమిళనాడు ఓటర్లు విజయ్లో ఒక ‘జన నాయగన్’ను చూశారు. అయితే.. ఒక్క ఎగ్జిట్ పోల్ అంచనా మాత్రం విజయ్ విషయంలో నిజమైంది. అదే యాక్సిస్ మై ఇండియా. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఒకే ఒక్క ఎగ్జిట్ పోలింగ్ ఏజెన్సీ ఇదే కావడం గమనార్హం.

తమిళనాడులో విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తాము ఎగ్జిట్ పోల్ వెల్లడిస్తే అందరూ నవ్వారని.. చివరకు తాము చెప్పిందే నిజమైందని యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా చెప్పారు. అంతేకాదు.. Axis My India ఎగ్జిట్ పోల్ అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ప్రదీప్ గుప్తా తన ఆఫీస్లో స్టెప్పులేస్తూ కనిపించారు. తమిళనాడులో విజయ్ పార్టీ అధికారం చేపడుతుందని.. ప్రతిపక్ష స్థానంలో డీఎంకే ఉంటుందని ప్రదీప్ గుప్తా ఫలితాలపై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడం గమనార్హం. కొత్తగా వచ్చి, ఎన్నికల బరిలో దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈసారి అధికార డీఎంకేకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సంస్థ వెల్లడించింది.

►ALSO READ | Trisha: సోషల్ మీడియాలో త్రిష ఓల్డ్ వీడియో వైరల్.. సీఎం అవుతానంటూ బోల్డ్ కామెంట్

టీవీకే 67 నుంచి 81 సీట్లను గెలుచుకోవచ్చని కామాఖ్య అనలైటిక్స్ అంచనా వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, అధికారాన్ని చేపట్టేందుకు కనీసం 118 సీట్లు అవసరం. విజయ్ టీవీకే పార్టీ ఇప్పటికే 110 స్థానాల్లో పైగా ఆధిక్యం కనబర్చడం విశేషం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. తుది ఫలితాలు హంగ్ను స్పష్టం చేస్తున్నాయి.