
- వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు
- బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి పారిపోయిన నిందితుడు
పద్మారావునగర్, వెలుగు: టాయిలెట్‌కు వెళ్లొస్తానని పోలీసులను నమ్మించి ఓ దొంగ పరార్ అయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సిక్ విలేజ్ కు చెందిన సోహైల్‌ఖాన్(19)ను దొంగతనం కేసులో బేగంపేట పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల కోసం ఆదివారం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల కస్టడీలో ఉన్న సోహెల్‌ఖాన్ మూత్రం వస్తుందని చెప్పడంతో బాత్‌రూమ్‌కు తీసుకువెళ్లారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన సోహెల్‌ఖాన్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి లోపల చూడగా కనిపించలేదు. బాత్‌రూమ్ లోని వెంటిలేటర్ నుంచి దూకి పారిపోయినట్లు గ్రహించారు. ఆయా ప్రాంతాల్లో గాలించినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్ తెలిపారు.