హైదరాబాద్‌లో వృద్ధుడి నుంచి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ

హైదరాబాద్‌లో వృద్ధుడి నుంచి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ

ముషీరాబాద్, వెలుగు: ఓ వృద్ధుడు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకుని వెళ్తుండగా దుండగులు లాక్కొని పారిపోయాడు. వృద్ధుడి దోమలగూడ ఇన్​స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన ప్రకారం.. ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌కు చెందిన వెంకటేశ్వరరావు(65) రిటైర్డ్ ఉద్యోగి. 

గురువారం అశోక్‌‌నగర్‌‌లోని యూనియన్ బ్యాంక్‌‌లో రూ.2.5 లక్షలు డ్రా చేసి బ్యాగులో పెట్టుకున్నాడు. తన కారు వైపు నడుస్తుండగా వెనక నుంచి బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాగును లాక్కొని పరారయ్యాడు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.