
కూకట్ పల్లి, వెలుగు: బ్యాంక్ లో డిపాజిట్ చేయమని ఓనర్ ఇచ్చిన డబ్బులను కొట్టేసి..చోరీ డ్రామా ఆడిన వర్కర్, డ్రైవర్ ని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని భరత్ జైన్ కి చెందిన ‘జై రాజేంద్ర జువెల్ ప్యాలెస్’ గోల్డ్ షాప్ లో ఢిల్లీకి చెందిన ఏపీలోని మచిలీపట్నంకి చెందిన దీన్ దాదర్(19) సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. భరత్ జైన్ జువెలరీ షాప్ కి చెందిన డబ్బును అప్పుడప్పుడు దీన్ దాదర్ కి ఇచ్చి బ్యాంక్ లో డిపాజిట్ చేయమని చెప్పేవాడు.
భరత్ జైన్ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసి మానేసిన ఏపీలోని గుంటూరులోని రొంపిచర్లకి చెందిన లింగ వినోద్ కుమార్(25) తో దీన్ దాదర్ కి పరిచయం ఏర్పడింది. దీన్ దాదర్, వినోద్ కుమార్ ఇద్దరూ కలిసి ఓనర్ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 30న ఓనర్ బ్యాంక్ లో డిపాజిట్ చేయమని భరత్ జైన్ రూ.11లక్షల 50 వేలను దీన్ దాదార్ కి ఇచ్చాడు. ఇదే తమ ప్లాన్ అమలుచేయడానికి సరైన సమయంగా భావించిన దీన్ దాదర్, వినోద్ కుమార్ చోరీ డ్రామా ఆడారు.
తాను రెగ్యులర్ గా వెళ్లే అల్లూరి ట్రేడ్ సెంటర్ నుంచి బ్యాంక్ కి వెళ్తుండగా..నలుగురు అడ్డగించి కత్తితో బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి డబ్బు ఎత్తుకెళ్లారని దీన్ దాదర్ ఓనర్ కి చెప్పాడు. దీంతో ఓనర్ భరత్ జైన్ కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దీన్ దాదర్ ని విచారించారు. అతడు చెప్పే మాటలకు. ఆధారాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు అతడిని మరింతగా విచారించారు. దీంతో వినోద్ కుమార్ తో కలిసి చోరీ డ్రామా ఆడినట్టు దీన్ దాదర్ విచారణలో ఒప్పుకున్నాడు. అనంతరం వినోద్ కుమార్, దీన్ దాదర్ ను అరెస్ట్ చేసి..డబ్బును రికవరీ చేశామని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.
ఆన్ లైన్ లో కెమెరా రెంట్ కి తీసుకుని మోసం ఆన్ లైన్ లో కెమెరాలను రెంట్ కి తీసుకుని వాటిని అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డికి చెందిన నగునూరి నిఖిల్ సాయి(25) బీటెక్ చేసేందుకు సిటీకి వచ్చి కూకట్ పల్లిలో ఉంటూ జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం మోసాలు చేసేందుకు ప్లాన్ వేశాడు. ఓఎల్ ఎక్స్ లో కెమెరాలను రెంట్ కి తీసుకునే నిఖిల్ సాయి వాటిని ఇతరులకు అమ్మేసేవాడు. ఆగస్టు 9న దొంతుల సునీల్ దగ్గర రెంట్ కి కెమెరా తీసుకున్న నిఖిల్ సాయి దాన్ని అమ్మేశాడు. సెప్టెంబర్ 22న కూకట్ పల్లి పీఎస్ లో సునీల్ కంప్లయింట్ చేశాడు. పోలీసులు నిఖిల్ సాయిని అరెస్ట్ చేసి8 కెమెరాలను రికవరీ చేశారు. కూకట్ పల్లి డివిజన్ అసిస్టెం కమిషనర్ సురేందర్ రావు, ఇన్ స్పె క్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మినారాయణ రెడ్డి, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి శ్రీను, అసిస్టెం ట్ ఎస్ ఐ హరిశంకర్, ఎస్ వోటీ టీమ్ సిబ్బం ది పాల్గొన్నారు.
చైన్ స్నాచర్ అరెస్ట్
సెప్టెం బర్ 30న చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..కూకట్ పల్లిలోని వీవీనగర్ లో
ఉండే రాజ్యలక్ష్మి(50) సెప్టెం బర్ 30న బతుకమ్మ పూల కోసం మార్కెట్ కి వెళ్లి ఇంటికి వస్తోంది. బైక్ పై నుంచి వచ్చిన కావటి రమణ(35) రాజ్యలక్ష్మి మెడలో ఉన్న గోల్డ్ చైన్ ను లాక్కొ ని పారిపోయాడు. రాజ్యలక్ష్మి భర్త రంగనాథ శాస్త్రి కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. వీటి ఆధారంగా చైన్ స్నాచర్ రమణను అరెస్ట్ చేశారు. కావటి రమణ మహబూబ్ నగర్ లోని
దేవరకద్రకి చెందినవాడని పోలీసులు తెలిపారు. జగద్గిరిగుట్టలో రమణ రెడీమేడ్ కిడ్స్ షోరూంను నడిపేవాడని..అందులో నష్టాలు రావడంతో లోన్లు కట్టలేక చైన్ స్నాచిం గ్ లు చేయడం మొదలుపెట్టాడని పోలీసులు వివరించారు. నిందితుడి దగ్గరి నుంచి మూడున్నర తులాల గోల్డ్ చైన్ ను రికవరీ చేశామన్నారు.