ఇది ఇండియా…హిందియా కాదు: స్టాలిన్

ఇది ఇండియా…హిందియా కాదు: స్టాలిన్

మన దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడేవారు ఉన్నారని…భారతీయులందరూ ఐక్యంగా ఉండాలంటే ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందీయేతర రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. సమాఖ్య స్పూర్తిపై దాడి చేసేలా ఉందన్నారు డీఎంకే అధినేత స్టాలిన్. ఇది ఇండియా.. హిందియా కాదన్నారు. హిందీని జాతీయ భాషగా చెప్పడం దేశానికి శాపమన్నారు ఎండీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ వైగో.