ఇండియాలో పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం

ఇండియాలో పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం
  • ఈజ్ ఆఫ్​డూయింగ్ బిజినెస్ పై కమిట్ మెంట్ తో ఉన్నం 
  • ‘దావోస్ ఎజెండా 2022’ సమిట్ లో ప్రధాని మోడీ    
  • వచ్చే 25 ఏండ్ల అవసరాలపై ఫోకస్ పెట్టినం 

న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో లోతైన రిఫామ్స్ ప్రవేశపెట్టడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా కమిట్ మెంట్ తో పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని గ్లోబల్ ఇండస్ట్రియలిస్టులు, ఎంట్రప్రెన్యూర్లకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ‘దావోస్ ఎజెండా 2022’ ఆన్ లైన్ సమిట్ లో ‘స్టేట్ ఆఫ్​ద వరల్డ్’ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. దేశంలో  క్లీన్ అండ్ గ్రీన్, సస్టైనబుల్ అండ్ రిలయబుల్ వృద్ధిపై ఫోకస్ పెట్టామని, ఇందుకోసం అన్ని అవసరాలు తీర్చేందుకు చర్యలు చేపట్టామని ఆయన ప్రకటించారు. ఇప్పటి అవసరాలకు మాత్రమే కాకుండా మరో 25 ఏండ్ల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీలు ప్రవేశపెడుతున్నామని, నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పీరియడ్ లో హై గ్రోత్, సంతృప్తికర స్థాయిలో సంక్షేమం సాధించాలన్న లక్ష్యాలు పెట్టుకున్నామన్నారు. వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లకు లైన్ క్లియర్ చేయడం కోసం అనేక రంగాలను డీరెగ్యులేట్ చేశామని, బిజినెస్ లో పాలనా వ్యవస్థ జోక్యాన్ని తగ్గించామని ప్రధాని చెప్పారు. బిజినెస్ పై కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గించామని, అనుమతులను సులభతరం చేశామన్నారు. 
ఆరు నెలల్లో 10 వేల స్టార్టప్ లు.. 
గ్లోబల్ సప్లై చైన్ లో ఇండియా ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ విజన్ లో భాగంగా అనేక దేశాలకు కరోనా టీకాలను, మందులను సరఫరా చేసి, లక్షలాది మంది ప్రాణాలను ఇండియా కాపాడిందని గుర్తు చేశారు. దేశంలో స్టార్టప్ లు పెరుగుతున్నాయని, గత ఆరు నెలల్లోనే 10 వేల స్టార్టప్ లు రిజిస్టర్ అయ్యాయని మోడీ చెప్పారు. ఇండియన్ యూత్ లో ఎంట్రప్రెన్యూర్ షిప్ కొత్త హైట్స్ కు చేరిందన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం, ఇన్నోవేషన్​లను ప్రవేశపెట్టడంలో వారు ముందంజలో ఉన్నారన్నారు. ఇప్పుడు ఎకనమిక్ గ్రోత్​ను కొనసాగిస్తూనే మరో కరోనా వేవ్ తో పోరాడుతున్నామని చెప్పారు.160 కోట్లకు పైగా డోసుల టీకాలతో సెల్ఫ్​ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నామన్నారు.  
పీ–3 మూమెంట్ రావాలె 
ప్రపంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ, ఇతర సవాళ్లపై ఏ ఒక్క దేశమో చర్యలు తీసుకుంటే సరిపోదని, అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు నడిస్తేనే అధిగమిస్తామని మోడీ అన్నారు. ఆర్థికమాంద్యం, వాతావరణ మార్పు, సప్లై చైన్ కు అంతరాయాల వంటి సవాళ్లను కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. లైఫ్​స్టైల్ సమస్యలూ సవాలుగా మారాయన్నారు. వీటిని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘మిషన్ లైఫ్’ మూమెంట్ రావాలన్నారు. భూగ్రహానికి అనుకూలమైన ప్రజలు.. ‘పీ-–3 (ప్రో ప్లానెట్ పీపుల్)’ ద్వారానే ఈ మిషన్ సక్సెస్ అవుతుందన్నారు.