సినిమా పిచ్చి : అమెరికాలో లక్షల్లో జీతం వదిలేసి.. కృష్ణనగర్ కు

సినిమా పిచ్చి : అమెరికాలో లక్షల్లో జీతం వదిలేసి.. కృష్ణనగర్ కు

సినిమా పిచ్చి.. అది ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళుతుంది. కొన్ని లక్షల మంది సినిమా ఇండస్ట్రీపై తమకున్న ప్యాషన్ తో సూపర్ అండ్ లగ్జరీ లైఫ్స్ ను వదులుకొని వచ్చి సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది అవకాశాలు దొరకక తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక మరికొంతమందేమో సినిమా అంటే ఇష్టం ఉన్నా.. కుటుంబ భాద్యతాల రీత్యా మనసుచంపుకొని నచ్చని జాబ్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. 

ఇక తాజాగా ఒక వ్యక్తి కూడా సినిమాపై, నటనపై తనకున్న పిచ్చితో అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని మరీ ఇండియాకి వచ్చేశాడు. అతని పేరే వికాస్ యాదవ్. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. వికాస్ కు చిన్నప్పటినుండి నటన అంటే చాలా ఇష్టం. అందుకే అమెరికాలో మంచి జాబ్ వదిలేసుకొని మరీ వచ్చేశారు. సినిమాల్లో అవకాశాల రావడం కంటే ముందుగా కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరుతెచ్చుకున్నారు వికాస్ యాదవ్. దాంట్లో కూడా లక్షల రూపాయలు సంపాదించాడు కానీ.. అది తనకు అమెరికాలో వచ్చే శాలరీకి చాలా తక్కువ. అది తన ఇష్టాన్ని ఆపలేకపోయింది. అందుకే తాను నమ్మిన దారిలో నడిచారు. విజయాన్ని సాధించాడు. 

ఇందులో భాగంగా తాజాగా ఇండియన ఎక్స్ప్రెస్ తో మాట్లాడాడు వికాస్ యాదవ్... నాకు నటన అంటే చాల ఇష్టం. 2015లో శ్రీరామ్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో నాలుగు నెలల థియేటర్ వర్క్‌షాప్‌ చేశాను. నిజానికి నేను సినిమా రంగంలోకి రావడం మా పేరెంట్స్ కు ఇష్టం లేదు. వాళ్ళు జాబ్ వదిలేస్తున్న అంటే భయపడ్డారు కానీ ఒప్పించాను. సినిమా అవకాశాలు రావడానికి. సోషల్ మీడియా బాగా హెల్ప్ అయ్యింది. నా వీడియోస్ కు చాల క్రేజ్ వచ్చింది. అలా సినిమా అవకాశాలు దక్కాయి అని చెప్పుకొచ్చారు వికాస్ యాదవ్.