ఈ ఫొటో అన్యోన్య జీవితానికి నిలువెత్తు నిదర్శనం

ఈ ఫొటో అన్యోన్య జీవితానికి నిలువెత్తు నిదర్శనం

హైదరాబాద్ : నిజమైన ప్రేమకు స్టేటస్ తో సంబంధంలేదు. అన్యోన్య దాంపత్యానికి గుడిసెలో ఉన్నా బంగ్లాలోనే ఉన్నట్లే. ఇలాంటి సూక్తులు ఎన్నో చెప్పుకోవచ్చు ఈ ఫొటో చూస్తే..! బతుకుదెరువు కోసం ప్లాసిట్ చాపలు అమ్ముకుంటున్న ఓ వ్యక్తి తన స్థాయికి తగ్గట్టు ఓ చిన్న టూ వీలర్(TVS)పై వెళ్తున్నాడు. అయితే అతడి బండి వెనకాల సీటుపై చాపలు ఉండటంతో.. TVS ముందు తన భార్యను కూర్చోబెట్టుకుని దర్జాగా వెళ్లాడు.

చిన్న పిల్లల్ని కూర్చోబెట్టే ఈ సీటుపై తన భార్యను కూర్చోబెట్టుకున్నాడు. ఆమె కూడా ఎంతో సంతోషంగా ఆ చిన్న లూనాపై కూర్చుని.. అన్యోన్య జీవితానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. భార్యను ప్రేమగా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నట్లుగా బండిపై వెళ్తున్న ఈ దృశ్యం సోమవారం ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర కనిపించింది. భార్యాభర్తలకు సర్దుకు పోయే మనసుంటే ఆ ఇల్లు స్వర్గమే కదా.. అనేలా ఈ ఫొటో అందరినీ ఆలోచింపజేస్తుంది..!