స్టేట్ బెస్ట్ టీచర్లు ఈసారి 48 మంది

స్టేట్ బెస్ట్ టీచర్లు ఈసారి 48 మంది

12 మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడా

సంతాప దినాల వల్ల టీచర్స్‌ డే వేడుకలు వాయిదా

హైదరాబాద్, వెలుగు: టీచర్స్‌ డే సందర్భంగా ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల లిస్టును రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 48 మందిని, వర్సిటీల పరిధిలో 12 మందిని, స్పెషల్ కేటగిరీలో ఒకరిని అవార్డుల కు ఎంపిక చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో జీహెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ 12 మంది.. ఎస్ఏ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోటాలో 23 మంది, ఎస్టీజీ/ పీఈటీ/ఎల్పీ/డైట్ కోటాలో 13మందిని సెలెక్ట్‌ చేసింది. వీరితో పాటు ఓయూ నుంచి ఐదుగురు, కేయూ నుంచి నలుగురు, తెలంగాణ, శాతవాహన వర్సిటీల నుంచి ఒక్కొక్కరు , పీడీ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ సదాశివయ్యకు స్పెషల్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో కేంద్రం సంతాప దినాలు ప్రకటించింది. దీంతో శనివారం జరగాల్సిన టీచర్స్ డే ప్రోగ్రాంను వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ సీఎస్ చిత్రారాంచంద్రన్ తెలిపారు.