
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ను కచ్చితంగా చంపి తీరుతామని గ్యాంగ్ స్టర్ గోల్డీబ్రార్(Goldy Brar) హెచ్చరించాడు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మేం సల్మాన్ ఖాన్ను తప్పకుండా చంపి తీరుతాం. అతడిని క్షమించబోనని భాయ్ సాబ్(లారెన్స్ బిష్ణోయ్) ఇప్పటికే తేల్చి చెప్పాడు. సల్మాన్ ఒక్కడే కాదు మేం బతికున్నంత కాలం మా శత్రువులందరిపైనా దాడులు చేస్తూనే ఉంటాం. అవి సక్సెస్ అయినప్పుడు మీకు తెలుస్తుంది’ అంటూ ఈ గ్యాంగ్స్టర్ వ్యాఖ్యానించాడు.
గతేడాది మేలో పంజాబీ సింగర్, రాజకీయ నాయకుడు సిద్దూ మూసేవాలాను(Sidhu Moose Wala) హత్య చేసింది కూడా తామేనని గోల్డీబ్రార్ ఈ సందర్భంగా ఒప్పుకున్నాడు.