రూ. 15 లక్షల విలువ చేసే ఆల్ఫా జోలం పట్టివేత

రూ. 15 లక్షల విలువ చేసే ఆల్ఫా జోలం పట్టివేత

హైదరాబాద్ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 మార్చి 25న సోమవారం భారీగా ఆల్ఫాజోలం పట్టుకున్నారు SOT, పోలీసులు. కార్లను తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో రూ. 15 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం బయటపడింది. దీంతో ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసకున్నారు పోలీసులు. నిందితుల దగ్గర ఉన్న మూడు స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారు, ఆల్ఫాజోలాన్ని సీజ్ చేశారు. 

ముఠాలోని వ్యక్తులను విచారించగా.. అనిల్ గౌడ్ ఒక సంవత్సరం ముందు సుధాకర్, శరత్ బాబులతో ముఠాను తయారు చేసి నాగర్ కర్నూల్ కు చెందిన నర్సింహులు అనే వ్యక్తి నుంచి ఆల్ఫా జోలంను పెద్ద ఎత్తున సేకరిస్తూ తెలిపారు. చుట్టుపక్క జిల్లాలలోని కల్లు దుకాణాలకు అమ్ముతున్నట్లు వివరించారు. నర్సింహులు అనే వ్యక్తి ఇంకా అనేక ముఠాలకు ఆల్ఫా జోలం సరఫరా చేస్తున్నట్లు పట్టుబడిన ముఠా సభ్యులు తెలిపారు.

ముఠా నాయకుడైన అనిల్ గౌడ్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో కొద్ది రోజుల ముందు మారుతీ స్విఫ్ట్ కారును కొని.. దీనిలోని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన 1 కేజీ ఆల్ఫా జోలం సుమారు రూ. 6 లక్షల లీటర్ల కల్లులో కలపడానికి సరిపోతుందని తెలిసింది. ఒక గ్రాము సుమారు 600 లీటర్ల లో కలుపుతారు.
ఇలాంటి కల్తీ కల్లును సేవించిన రోజువారీ కూలీలు ఎన్నో రుగ్మతలకు లోనవుతున్నారు.