ఒడిశా నుంచి బ్రౌన్ షుగర్..హైదరాబాద్ సిటీలో విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

ఒడిశా నుంచి బ్రౌన్ షుగర్..హైదరాబాద్ సిటీలో విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

బషీర్​బాగ్​, వెలుగు: సైఫాబాద్ లో డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సైఫాబాద్‌‌ పీఎస్‌‌ పరిధిలోని ఐమాక్స్‌‌ ఓపెన్‌‌ గ్రౌండ్‌‌ సమీపంలో సెంట్రల్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ ఫోర్స్‌‌, సైఫాబాద్‌‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మొహమ్మద్‌‌ గులాం జిలానీ, ఫిరోజ్‌‌ బిన్‌‌ అలీ , సులేమాన్‌‌ ఖాన్‌‌ ను అరెస్టు చేసి 100 గ్రాముల బ్రౌన్‌‌ షుగర్‌‌, 1,350 గ్రాముల డ్రై గంజాయి, 7 మొబైల్‌‌ ఫోన్లు, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నారు. 

జిలానీ ఒడిశా నుంచి బ్రౌన్ షుగర్ ను గ్రాము 5 వేలకు కొనుగోలు చేసి వాటిని సాహిల్‌‌, సులేమాన్‌‌లకు సరఫరా చేస్తున్నాడు.  వీరు గ్రాముకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా నవంబర్‌‌ 4న రేతిబౌలి ప్రాంతానికి చెందిన మొహమ్మద్‌‌ అహ్మద్‌‌కు 3 గ్రాముల బ్రౌన్‌‌ షుగర్‌‌ విక్రయించగా అతడు అధిక మోతాదులో తీసుకుని మృతిచెందిన ఘటనలో రాజేంద్రనగర్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి అమ్ముతున్న ముగ్గురు..

అల్వాల్: గంజాయి సరఫరా చేస్తున్న ఫతేనగర్ కు చెందిన కళ్యాల మధు(32), బాలానగర్ ఫతేనగర్ పార్దిబస్తీకి చెందిన సుదేశ్(36), కీసర వికలాన్ కాలనీకి చెందిన కళ్యాణ రాజు(53 )ను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం భద్రాచలం నుంచి అల్వాల్ లోని ఐస్ ఫ్యాక్టరీకి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా తెలియడంతో పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్​కు తరలించారు.