నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంటులోకి..ముగ్గురు అరెస్ట్

నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంటులోకి..ముగ్గురు అరెస్ట్

నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు ముగ్గురిని CISF సిబ్బంది పట్టుకున్నారు.  వివిధ సెక్షన్ల కింద  ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.   ఎఫ్ఐఆర్ ప్రకారం, జూన్ 4 మధ్యాహ్నం 1:30 గంటలకు ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డుల ద్వారా గేట్ నంబర్ 3 నుండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు.  కాసిం, మోనిస్, సోయెబ్‌గా గుర్తించారు.   సాధారణ భద్రత, గుర్తింపు తనిఖీల సందర్భంగా పార్లమెంటు హౌస్ ఫ్లాప్ గేట్ ఎంట్రీ వద్ద ఈ ముగ్గురిని CISF సిబ్బంది అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.   వారి ఆధార్ కార్డులు నకిలీవని సీఐఎస్ఎఫ్ గుర్తించింది.

కాగా  గతంలో అంటే  2023 డిసెంబర్ 13 న ఇద్దరు యువకులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి ప్రజాప్రతినిధులు ఉన్న గ్యాలరీలోకి దూకి, కలర్ స్మోక్‌ను విడుదల చేశారు. . ఈ సమయంలో హాలు మొత్తం పొగతో నిండిపోయింది.అప్పటి నుంచి పార్లమెంట్ భద్రతను పెంచారు. నిందితులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. వారితో పాటు, ఇతర సహచరులను కూడా అరెస్టు చేశారు. అలా ఈ కేసులో ఇప్పటి వరకు 6 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు భద్రతను మార్చింది.