కుత్బుల్లాపూర్లో ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్..6బైకులు స్వాధీనం

కుత్బుల్లాపూర్లో ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్..6బైకులు స్వాధీనం

హైదరాబాద్ లో బైక్ చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ చోరీకి గురైందని ఓ వ్యక్తి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో బైక్ దొంగల ఆట కట్టించారు. వారి నుంచి దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకుల దొంగతనం  చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం (జూలై30) అరెస్ట్ చేశారు.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..జూలై 26న సుభాష్ నగర్ కుచెందినరాకేష్ ఫతరాం అనే వ్యక్తి బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు  చేసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో ఇవాళ ముగ్గురు నిందితులు మహ్మద్ గౌస్, నవీద్ అబ్దుల్, విజయ్ దుర్గం లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ముగ్గురు నిందితులనుంచి దొంగిలించిన బైకులను కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తున్న మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అరెస్టయిన నిందితులపై పలు బైక్ చోరీ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.