వేములవాడ, వెలుగు: వేములవాడలో జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. గెలిచినవారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురిలో నరాల శేఖర్, ఇండిపెండెంట్లు కుమ్మరి శిరీష-, ఎలా శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. వారికి విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 16 స్థానాలకు చేరుకుంది. వారంతా ఒకే క్యాంపులో ఉండిపోయారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజు వేములవాడకు చేరుకుంటారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు రోజురోజుకు విశ్వాసం పెరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.
