హిజ్రాల ముసుగులో దొంగతనాలు

హిజ్రాల ముసుగులో దొంగతనాలు

హిజ్రాల ముసుగులో దొంగతనాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడ లో జరిగింది. మల్కాజ్ గిరి సీసీఎస్ క్రైం అడిషనల్​ డీసీపీ సలీమా మాట్లాడుతూ.. యాదయ్య, ఆంజనేయులు, బాబయ్యలు అనే వీళ్లు ఈజీ మనీకి అలవాటుపడి హిజ్రాలుగా మారారని చెప్పారు. వీళ్లు ఆటోలో తిరుగుతూ.. దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు.

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి చర్లపల్లిలో మీనాక్షి అనే మహిళ ఇంటి వద్దకు వెళ్లిన ఈ నకిలీ హిజ్రాలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నగదును డిమాండ్ చేశారు. ఆమె వారికి రూ.200 ఇస్తాననడంతో తనను మాటల్లో పెట్టి ఇంట్లోకి వెళ్లిన హిజ్రాలు… ఇంట్లో ఉన్న 50వేల నగదును దొంగతనం చేసి ఆటోలో పరారయ్యారు.

కొంత సేపటికి  తరువాత జరిగిన దొంగతనాన్ని తెలుసుకున్న మీనాక్షి.. పోలీసులకు కంప్లేంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. ఆటోను గుర్తించారు. బోడుప్పల్ లో తిరుగుతున్న వారిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 42వేల రూపాయలను రికవరీ చేసి ఆ ముగ్గురు నింధితులను రిమాండ్ కు పంపారు.