ములుగు జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురి మృతి.. ఇద్దరికి సీరియస్

ములుగు జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురి మృతి.. ఇద్దరికి సీరియస్

వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్లిన లారీ ఓ ట్రాక్టర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‎లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో  వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ద్వారా  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామారం వాసులుగా గుర్తించారు. మృతులు మేడారం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  

మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

ALSO READ | ఆంధ్రాలో వరుస విషాదాలు.. కారు డోర్లు లాక్ అయి నలుగురు, నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి