
విజయనగరం/చిత్తూరు: ఆంధ్రాలోని విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయి నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం మండలం ద్వారపూడిలో ఈ దుర్ఘటన జరిగింది. ఆగి ఉన్న కారులో ఆడుకునేందుకు చిన్నారులు కారు లోపలికి వెళ్లారు. అక్కడున్న వాళ్లు గమనించి కారు డోర్లు అన్ లాక్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
చిత్తూరు జిల్లాలో కూడా శోచనీయ ఘటన జరిగింది. నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుప్పం మండలం దేవరాజపురంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన చిన్నారులను.. గౌతమి, షాలిని, అశ్విన్‌గా గుర్తించారు. ఆంధ్రాలో జరిగిన ఈ రెండు దుర్ఘటనల్లో చనిపోయింది అభంశుభం తెలియని చిన్నారులే కావడం అత్యంత శోచనీయం.