
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మే 18న తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ప్రమాదం జరిగిన కాసేపటికే ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే భారీగా మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌లో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తీసుకోవడానికి మొత్తం రెండు గంటల సమయం పట్టింది.
ALSO READ మీర్ చౌక్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
ప్రమాదంలో చనిపోయిన 17 మంది మృతుల్లో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, 8 మంది పదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. మొత్తం 70 ఫైర్ సిబ్బంది, 17 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 8 మంది సిబ్బంది బ్రీతింగ్ అపరాటస్ (BA Sets) ధరించి రక్షణలో పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మృతుల వివరాలు
ప్రహ్లాద్( 70)
మున్నీ(70)
రాజేందర్ మోడీ (65)
సుమిత్ర – (60)
హమీ – (7)
అభిషేక్ –( 31)
షీతల్ (35 )
ప్రియాంశ్(4 )
ఇరాజ్ –( 2 )
ఆరుషి –(3)
రిషభ్ –( 4)
ప్రతమ్ – 1 సంవత్సరం 6 నెలలు,
అనుయన్ – (3 )
వర్షా – (35)
పంకజ్ –(36)
రాజిని –( 32)
ఇద్దు – (4 )