ఒకే కాలనీలో ఒకేరోజు ముగ్గురు పిల్లలు అదృశ్యం.మెదక్ జిల్లా రామాయం పేటలో మిస్సింగ్ కలకలం..

ఒకే కాలనీలో ఒకేరోజు ముగ్గురు పిల్లలు అదృశ్యం.మెదక్ జిల్లా రామాయం పేటలో మిస్సింగ్ కలకలం..

రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పరిధిలోని  కేసీఆర్ కాలనీకి చెందిన 14 ఏండ్ల లోపు ముగ్గురు పిల్లలు గురువారం రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. రామాయంపేట ఎస్సై  బాలరాజ్ తెలిపిన  వివరాల ప్రకారం..  కాలనీకి చెందిన సమీర్, మనోజ్, ధనుష్  ముగ్గురు  స్థానిక ప్రభుత్వ హైస్కూల్ లో 9, 8 తరగతులు చదువుతున్నారు. 

ఈ ముగ్గురు బాలురు గురువారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.