ఇంగ్లండ్‌‌‌‌ టెస్టు టీమ్‌‌‌‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు

ఇంగ్లండ్‌‌‌‌ టెస్టు టీమ్‌‌‌‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు
  •     ఇండియాతో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌కు జట్టు ప్రకటన

లండన్‌‌‌‌ :  టీమిండియాతో జనవరిలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో పాల్గొనే ఇంగ్లండ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లకు అవకాశం లభించింది. ఈ మేరకు 16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ఇంగ్లండ్‌‌‌‌ బోర్డు సోమవారం ప్రకటించింది.

సర్రే ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌‌‌‌, స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (లాంకషైర్‌‌‌‌‌‌‌‌), షోయబ్ బషీర్‌‌‌‌‌‌‌‌(సోమర్‌‌‌‌‌‌‌‌సెట్) తొలిసారి నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకున్నారు.   వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌ కారణంగా వచ్చే ఐపీఎల్‌‌‌‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన బెన్‌‌‌‌స్టోక్స్‌‌‌‌ ఈ టీమ్‌‌‌‌ను నడిపించనున్నాడు.  జనవరి 25 నుంచి హైదరాబాద్‌‌‌‌లో జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్‌‌‌‌ షురూ అవుతుంది

ఇంగ్లండ్ టెస్ట్ టీమ్: రెహాన్ అహ్మద్, ఆండర్సన్, అట్కిన్సన్, బెయిర్‌‌‌‌స్టో, బషీర్, బ్రూక్, క్రాలీ, డకెట్, ఫోక్స్, హార్ట్లీ, జాక్ లీచ్, పోప్, ఓలీ రాబిన్సన్, రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మార్క్ వుడ్.