
మెహిదీపట్నం, వెలుగు: ఒంటె మాంసం అమ్ముతున్న ముగ్గురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీసీ నితికా పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి పరిధి హకీంపేట పారామౌంట్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (30), మహ్మద్ సల్మాన్ (23), సిరాజ్ ఖాన్ (40) ఈ ముగ్గురు మాంసం అమ్మే వ్యాపారం చేస్తున్నారు. 3 నెలల క్రితం 7 ఒంటెలను తీసుకువచ్చి వాటిని చంపి ఆ మాంసాన్ని స్థానిక ఏరియాలో అమ్మడం మొదలుపెట్టారు. దీని గురించి సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. పారామౌంట్ కాలనీ ఏరియాలో దాడులు చేశారు. ఇల్లీగల్‌గా ఒంటె మాంసం అమ్ముతున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి ఈ ముగ్గురిని ఫిల్మ్ నగర్ పీఎస్‌లో అప్పగించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.