రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

 రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ద్రోణి/ గాలిలోని అనిశ్చితి కారణంగా దక్షిణ చత్తీస్ గడ్ నుంచి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో రాగల ఐదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40°C (డిగ్రీల సెంటీగ్రేడ్) కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపింది.