మజ్లిస్ రాజేంద్రనగర్ అభ్యర్థిగా రవి యాదవ్

మజ్లిస్ రాజేంద్రనగర్ అభ్యర్థిగా రవి యాదవ్
  • రాజేంద్రనగర్ అభ్యర్థిగా రవి యాదవ్
  • ప్రకటించిన మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు :  రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ బెల్లి రవియాదవ్​ను ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ప్రకటించారు. రవి యాదవ్ గతంలో లంగర్​హౌజ్ డివిజన్ నుంచి కార్పొరేటర్​గా పని చేశారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసిన రహమత్ అలీబేగ్, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ చేతిలో ఓడిపోయాడు. 

ఈ నియోజకవర్గంలో 5.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే రాజేంద్రనగర్​పై మజ్లిస్ ఫోకస్ పెట్టింది. హిందువుల ఓట్లు కూడా పడ్తాయని మజ్లిస్ భావిస్తున్నది. పోటీ చేయాలనుకుంటున్న 9 నియోజకవర్గాల్లో ఎనిమిదింటిలో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. బహదూర్​పురా ఇంకా పెండింగ్​లో ఉంది. అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు నూరుద్దీన్ ఒవైసీని బహదూర్​పురా నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.