జనగామను వణకిస్తున్న పెద్దపులి..భయాందోళనలో స్థానికులు

జనగామను వణకిస్తున్న పెద్దపులి..భయాందోళనలో స్థానికులు

జనగామ జిల్లాలో పెద్దపులి హల్ చల్ చేస్తోంది. గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  జనగామ శివారు ఎల్లంల, సిద్దెంకి, పెంబర్తి-, ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామాల సరిహద్దులో పాదముద్రల ఆధారంగా పులి కదలికలు గుర్తించారు అటవి శాఖ అధికారులు. దీంతో   బోన్స్ , డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.  పులిని బంధించేందుకు మూడు ట్రాప్ బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు  చేశారు. డ్రోన్ కెమెరాలతో పులి జాడ కోసం  ట్రాకింగ్ బృందాలు గాలిస్తున్నాయి.

టైగర్ సంచారంతో పరిసర గ్రామాల్లో  టెన్షన్ టెన్షన్ ఉంది.  పులి లేగ దూడను చంపడంతో  అప్రమత్తం అయిన అటవి శాక అధికారులు దండోరా వేసి గ్రామాలను అలర్ట్  చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ బావులకు ఒంటరిగా వెళ్లొదని  హెచ్చరికలు జారీ చేశారు.