
చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్‘టిక్ క్’. మన దేశంలో మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఈ ఎంటర్టైన్ మెంట్యాప్ను రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి టిక్ టాక్ వీడియోలు ఎక్కువగా అప్ లోడ్అవుతుండటం విశేషం. ఈ యాప్ ద్వారా యువత పాడైపోతోందని, పోర్నోగ్రఫీ పెరిగిపోతోం దని, హింసను ప్రేరేపించే సంభాషణలు వైరల్ అవుతున్నాయన్నఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి.మరోవైపు ఈ యాప్ను మన దేశంలో పూర్తిగా బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం పై పలురాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే మనదగ్గర ఇంతలా నెగిటివ్ మార్కులు మూటగట్టుకున్న టిక్ టాక్ పరిస్థితి..అమెరికాలో మాత్రం మరోలా ఉంది.క్రియేటివిటీని పెంచుకునేందుకు ఈయాప్ను ఉపయోగిం చుకుంటోది అక్కడి యువత.
సవాల్ గా తీసుకున్నారు
టిక్ టాక్ యాప్ వల్ల జరగబోయే పరిణామాలను అమెరికా కొంచెం ముందుగానే అంచనా వేసింది. తమ దేశంలోని పిల్లలు ఈయాప్‌ను ఉపయోగించేందుకు కఠినమైన నిబంధనలను విధించింది. ఒకానొక టైంలో నిబంధనలు అతిక్రమించిన టిక్‌టాక్ భారీ జరిమానా విధించింది. పెదాలను సింక్ చేస్తూ చాలా వేగంగా షార్ట్ వీడియోలు తీయడం మాత్రమే కాదని.. ఈ యాప్‌వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయనే ప్రచారం విస్తృతంగా కల్పించింది. ‘టిక్‌టాక్ పాజిటి విజం’ను ఒక సవాల్ గా తీసుకుని ప్రజల్లోఅవగాహన పెంపొందించేందుకు యాడ్ల ద్వారా ప్రయత్నం చేసింది.
కామెడీగా మొదలై..
అమెరికన్ కమెడియన్ జిమ్మీ ఫాలోన్ ‘దిటునైట్ షో’ ద్వారా టిక్‌టాక్ ఫన్నీ చాలెంజ్ లుపుట్టు కొచ్చాయి. టంబ్లెవీడ్ చాలెంజ్(నేల మీదపడి దొర్లడం), హిట్ ఆర్ మిస్(యూట్యూబర్ స్మోక్ హిజాబి రూపొందించిన ‘మియాఖలీఫా’ సాంగ్ లిరిక్స్) చాలెంజ్ లు ఫాలోస్ మూలంగానే వైరల్ అయ్యాయి. అయితేరాను రాను టిక్‌టాక్ సరదాను కొందరుయువత డిఫరెంట్ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వినూత్నమైన చాలెంజ్ లను వైరల్ చేస్తున్నా రు. విచిత్రమైన మేకప్ ద్వారా ‘ఈగర్ల్’చాలెంజ్, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసే ‘ప్రెట్టీ బాయ్ స్వాగ్’,ఒకే అద్దం ముందు పరిగెడుతూ అద్భుతాన్నిక్రియేట్ చేస్తున్న ‘మిర్రర్ రన్ చాలెంజ్’ఇప్పుడు అమెరికాలో వైరల్ చాలెంజ్ లు. సరదా చాలెంజ్ లతో పాటు, ఇతరులకు సాయంచేయడం, కొత్త కొత్త ఆవిష్కరణలకు టిక్‌టాక్‌ఇప్పుడు అక్కడ వేదిక అవుతోంది.
వాళ్లకు ఉపాధి
టిక్‌టాక్ వైరల్ వీడియోల ద్వారాయూట్యూబర్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది.టిక్‌టాక్‌లో బాగా వైరల్ అయిన ఒక వీడియోను విశ్లేషిం చడం, తద్వారా ఆ వీడియోతో డబ్బుసంపాదించుకుంటున్నా రు. యాడ్లు, ఇంకో వైపు టిక్‌టాక్ వల్ల తమ పాటలకు ఫుల్ గిరాకీఉండటంతో ఆడియో రికార్డు లేబుల్స్ కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి.రాలు