టిక్​టాక్​ @150 కోట్లు

టిక్​టాక్​  @150 కోట్లు
  • రికార్డ్​ డౌన్​లోడ్​లు..
  • 46.68 కోట్లతో ఇండియా టాప్​

టిక్​టాక్.. యువతను ఊపేస్తున్న యాప్. కొందరు టైంపాస్​కు వీడియోలు పెడుతుంటే, మరికొందరు తమలోని ట్యాలెంట్​నంతా బయటపెట్టేందుకు అదే మంచి వేదిక అనుకుంటున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అంతలా అందరికీ చేరువైంది ఆ యాప్​. మరి, అలాంటి యాప్​ రికార్డులు కొట్టేయకుండా ఉంటుందా? కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఆ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. ఆ డౌన్​లోడ్​లలోనూ మన దేశమే ముందుండడం మరో విశేషం. ఒక్క ఇండియాలోనే దాదాపు 46.68 కోట్ల మంది టిక్​టాక్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. మొత్తం డౌన్​లోడ్​లలో 31 శాతం వాటా మనదే. ఇక, ఈ ఏడాది మొత్తం 61.4 కోట్ల మంది టిక్​టాక్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ. మన దేశంలో ఈ ఏడాది 27.76 కోట్ల మంది దాన్ని డౌన్​లోడ్​ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన వాటా 45 శాతం. ఆ తర్వాత 4.55 కోట్ల డౌన్​లోడ్​లతో చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశం వాటా 7.4 శాతం. ఆ తర్వాత 3.76 కోట్ల (6%) డౌన్​లోడ్​లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఎక్కువగా డౌన్​లోడ్​ చేసుకున్న నాన్​ గేమింగ్​ యాప్​లలో టిక్​టాక్​ది మూడో స్థానం. 70.74 కోట్ల డౌన్​లోడ్​లతో వాట్సాప్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది.

TikTok Now Has 150 Crores Users Worldwide And Special Credit Goes To India