ఓటు వేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగాట్

ఓటు వేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగాట్

హర్యానా: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు  పోలింగ్ కొనసాగుతుంది. హర్యానాలోని అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేస్తున్న టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగాట్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయిపై పోటీ చేస్తున్నారు.

టిక్‌టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్న ఫోగట్.. కొన్ని సీరియళ్లలో కూడా నటించారు. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ బీజేపీ నాయకుడు.. ఆయన మరణించిన తరువాత సోనాలి కూడా బీజేపీలో చేరారు. ఆమెను పార్టీ రాష్ట్ర మహిళా మోర్చ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది బీజేపీ. లెటెస్ట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.