6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు

6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
  •     వెల్లడించిన ఎన్​ఎస్​ఎన్​ఓ

న్యూఢిల్లీ : పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగం రేటు ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో సంవత్సరానికి 6.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గిందని నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్​ఎస్​ఎస్​ఓ) తెలిపింది.   నిరుద్యోగం లేదా నిరుద్యోగిత రేటును శ్రామిక శక్తిలో నిరుద్యోగుల శాతంగా నిర్వచిస్తారు. 2023 ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్​లో నిరుద్యోగిత రేటు 6.8 శాతం కాగా, ఏప్రిల్–-జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అలాగే అంతకుముందు ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో (జూలై-–సెప్టెంబర్ 2023) 6.6 శాతంగా ఉంది.

ఇది అక్టోబర్–-డిసెంబర్ 2023లో 6.5 శాతంగా ఉంది. 2024 జనవరి–-మార్చిలో 15 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 6.7 శాతంగా ఉందని 22వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్​ఎఫ్​ఎస్​) వెల్లడించింది. పట్టణ ప్రాంతాల మహిళల్లో (15 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) నిరుద్యోగం రేటు 2024 జనవరి–-మార్చిలో 8.5 శాతానికి తగ్గింది. ఇది ఏడాది క్రితం ఇదే క్వార్టర్​లో 9.2 శాతంగా ఉంది. నిరుద్యోగిత గత ఏప్రిల్–-జూన్​లో 9.1 శాతం, 2023 జూలై–-సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.6 శాతం, అక్టోబర్–-డిసెంబర్ 2023లో 8.6 శాతంగా రికార్డయింది.

పురుషులలో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 2024 జనవరి-–మార్చిలో 6.1 శాతానికి పెరిగింది, ఇది సంవత్సరం క్రితం కాలంలో 6 శాతంగా ఉంది. అయితే, 2023 ఏప్రిల్–-జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.9 శాతం, జూలై-–సెప్టెంబర్ 2023లో 6 శాతం, అక్టోబర్–-డిసెంబర్ 2023లో 5.8 శాతంగా ఉంది. 15 ఏళ్లు,  అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల కోసం పట్టణ ప్రాంతాల్లో కరెంట్ వీక్లీ స్టేటస్ (సీడబ్ల్యూఎస్​)లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు జనవరి–-మార్చి 2024లో 50.2 శాతానికి పెరిగింది, ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో 48.5 శాతంగా ఉంది. ఇది ఏప్రిల్-–జూన్ 2023లో 48.8 శాతం, జూలై–-సెప్టెంబర్ 2023లో 49.3 శాతం  2023 అక్టోబర్-–డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 49.2 శాతం ఉంది.