ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా

ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా

బాలాసోర్​: ఒడిశా ప్రజలు సర్కారును మార్చాలనుకుంటున్నారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. ఒడిశాలోని ప్రస్తుత బీజేడీ పాలనతో ప్రజలు విసిగిపోయార ని పేర్కొన్నారు. బుధవారం ఒడిశాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘గత 25 ఏండ్లుగా రాష్ట్రంలో ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన, అసమర్థ ప్రభుత్వం ఉందని ఒడిశా ప్రజలు ఇప్పుడే గుర్తిస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందింది. ప్రధాని తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో భారత ఎకానమీ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధి వేగంగా జరగుతుంది” అని వివరించారు.