
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వేలాదిగా జనం తరలి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం (మే 17) ట్యాంక్ బండ్ పై తిరగార్యాలీ చేపట్టారు.
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామీ వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా కార్యకర్తలు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
►ALSO READ | త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ: మంత్రి పొన్నం
మేప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలను, ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది ఇండియా. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందనీ బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాయి.