తెలంగాణ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రతిష్టాత్మక టీజీ20 (TG20) లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. రేపు ( జులై 12, ఆదివారం) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మెగా టోర్నీ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ చారిత్రాత్మక తొలి టైటిల్‌ను ముద్దాడటం కోసం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వర్సెస్ ఖమ్మం ఏసర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరడంతో, రేపటి మ్యాచ్‌లో టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనోస్తుంది.
విన్నర్‌కు కోటి ప్రైజ్ మనీ:
ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. మీడియా సమావేశంలో హెచ్‌సీఏ సెక్రెటరీ జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్, టీజీ20 కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన (Winner) జట్టుకు ఏకంగా రూ.1 కోటి నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన రన్నర్స్ జట్టుకు రూ.50 లక్షలు, సెమీఫైనల్స్ వరకు వచ్చిన జట్లకు చెరో రూ.25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందించబోతున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో నగదు బహుమతులు ప్రకటించడంతో లీగ్ వాల్యూ మరింత పెరిగింది.
యువతకు గోల్డెన్ చాన్స్:
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునేందుకు TG20 లీగ్ ఒక ఒక వండర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని హెచ్‌సీఏ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ తరహాలోనే స్థానిక ఆటగాళ్లు ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియంలో, భారీ ప్రేక్షకుల మధ్య ఒత్తిడిని తట్టుకుని ఎలా ఆడాలో నేర్చుకోవడానికి ఈ టోర్నీ ఎంతో దోహదపడిందన్నారు. ఇక్కడి ప్రదర్శన ఆధారంగానే భవిష్యత్తులో పలువురు యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ స్కౌట్ల కళ్లలో పడే ఛాన్స్ కూడా ఉంది.
ఉప్పల్ స్టేడియానికి భారీగా ఫ్యాన్స్:
ఇక ఫైనల్ పోరుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ట్రోఫీని తామంటే తామే గెలుస్తామని, వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముందు ధీమా వ్యక్తం చేశారు. రేపు (ఆదివారం) ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియానికి తరలిరానున్నారు.
We're ready for the ultimate showdown! 🤜🤛
— tg20official (@tg20official) July 11, 2026
Chama Milind 🆚 Abhirath Reddy
Anvita Khammam Ace 🆚 Hyderabad E Champions
Who will land the knockout punch tomorrow?#TG20Final #AKAvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/DMZbJTpmTv
