ఆర్టీసీని విలీనం చేయకపోతే మళ్లీ సమ్మె చేస్తాం .. టీజేఎంయూ హెచ్చరిక 

ఆర్టీసీని విలీనం చేయకపోతే మళ్లీ సమ్మె చేస్తాం .. టీజేఎంయూ హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే తమకు మద్దతు ఇచ్చే వారితో కలిసి మళ్లీ సమ్మె చేస్తామని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ హెచ్చరించారు. గురువారం బస్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఆమరణ దీక్షను ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. తాను దీక్ష కొనసాగించాలని చూసినా పోలీసులు ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయకుండా యూనియన్ల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే మరో రెండేళ్లు ఆలస్యం అవుతుందని అన్నారు. దీంతో విలీనం అంశం పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.