ఆటో డ్రైవర్లకు పక్కా ఇళ్లు కట్టించాలె

ఆటో డ్రైవర్లకు పక్కా ఇళ్లు కట్టించాలె

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహా స్వామి గుట్టపైకి ఆటోలకు అనుమతి ఇవ్వాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలంటూ బుధవారం డ్రైవర్లు చేపట్టిన దీక్షకు కోదండరాం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుట్టపైకి ఆటోలను అనుమతించకపోవడంతో దాదాపు 300 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం చేపట్టిన గుట్ట అభివృద్ధి పనుల వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు తమ ఇళ్లు కోల్పోయారని, ప్రభుత్వం వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గుట్టపైకి ఆటోలకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

పోడు సాగుదారులపై దాడుల్ని వెంటనే ఆపాలి

హింసకు పాల్పడిన వారిని ఉపేక్షించేదిలేదు