పోడు సాగుదారులపై దాడుల్ని వెంటనే ఆపాలి

పోడు సాగుదారులపై దాడుల్ని వెంటనే ఆపాలి
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

పోడు సాగుదారులపై జరుగుతున్న దాడుల్ని వెంటనే ఆపాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. ఇప్పటి వరకు పోడుసాగుదారులకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోడు భూముల సమస్య రావణకాష్టంలో రగులుతూనే ఉందని..  వర్షా కాలం వస్తుండటంతో పోడుసాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న వారికి  ఇచ్చిన హామీ మేరకు వెంటనే పోడుసాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ఆయన  డిమాండ్ చేశారు.
అటవీశాఖ అధికారులు దాడులు చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. కేసీఆర్, అధికారులు పోడు సాగుదారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు సీపీఐ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని ఆయన తెలిపారు. 
ఈనెల 28న మహాధర్నా
పోడుభూములకు పట్టాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్దమౌతున్నాయి వామపక్ష పార్టీలు. డబుల్ ఇండ్లు, ఉద్యోగ ఖాళీలు, పెరిగిన ధరలపై ఈ నెల 28న ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు వామపక్ష లీడర్లు వెంకటేశ్వరరావు, గోవర్ధన్, సంద్య. కొట్లాడితెచ్చుకున్న స్వరాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరడం లేదన్నారు. మహాధర్నాకి ఆదివాసులు, గిరిజనులు, నిరుద్యోగుల పెద్దఎత్తున తరలివస్తున్నట్లు తెలిపారు నేతలు.

 

 

ఇవి కూడా చదవండి

హింసకు పాల్పడిన వారిని ఉపేక్షించేదిలేదు

అంబేద్కర్ పేరు ముందే పెడితే సమస్య ఉండేదే కాదు

హెల్మెట్ పట్టీ పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్