అంబేద్కర్ పేరు ముందే పెడితే సమస్య ఉండేదే కాదు

అంబేద్కర్ పేరు ముందే పెడితే సమస్య ఉండేదే కాదు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పేరు పెడితే సమస్య ఉండేదికాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వ వైఖరే కోనసీమ ఘటనకు కారణమన్నారు ఆయన. ఈ మేరకు ఆయన ఒక వీడియో బైట్ విడుదల చేశారు. 
కోనసీమ ఘటన చిలికి చిలికి గాలివానగా మారి చివరకు మంత్రి ఇంటినే తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనను కేవలం కుల ఘర్షణగా చూడడానికి వీల్లేదని, ఎక్కడ వీలుంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని  ప్రతిబింబించే రీతిల ఉద్యమాలు వస్తాయని.. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం లేకుండా భావాలు పంచుకోలేకపోతారో అప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పారు. జిల్లాలు ప్రకటించే సమయంలోనే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఎవరూ అడిగి ఉండేవారు కాదని.. తర్వాత ఎందుకు రాజీపడ్డారని ఆయన ప్రశ్నించారు. పేరు మార్పు విషయంలో రాజకీయ లబ్ది తప్ప ఇంకేమీ కనిపించడం లేదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ సర్కార్ ఆత్మపరిశీలన చేసుకోవాలని.. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలిస్తే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవని నారాయణ తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

హెల్మెట్ పట్టీ పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్

నేతల ఇళ్ల మీద దాడి చేసిన వారిపై.. అట్రాసిటీ కేసులు పెట్టాలి

ఎన్నికల వార్​లో సోషల్​ సైన్యం