హెల్మెట్ పట్టీ పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్

హెల్మెట్ పట్టీ పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్

ముంబై : రోడ్డు ప్రమాదాల నివారణకు ముంబై ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. నిబంధనలు మరింత కఠినం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా టూవీలర్పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో ఈ నిబంధన అమలు చేయాలని భావిస్తున్న పోలీసులు.. ఉల్లంఘించే వారికి రూ.500 ఫైన్తో పాటు 3 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. 

హెల్మెట్ ధరించని వారికి రూ.2వేలు ఫైన్ విధించేలా ప్రభుత్వం ఇటీవలే 1998 మోటార్ వెహికిల్ యాక్ట్లో మార్పు చేసింది. ఈ నేపథ్యంలో వెనుక కూర్చునే వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా నిబంధనల్లో మార్పు చేసింది. చట్టంలో చేసిన తాజా సవరణల ప్రకారం..

  • హెల్మెట్ పట్టీ పెట్టుకోని పక్షంలో వాహనదారునికి రూ.1000 జరిమానా విధించనున్నారు.
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ సర్టిఫికేట్ లేని హెల్మెట్ ధరిస్తే రూ.1000ఫైన్ వేయనున్నారు.
  • హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ రెడ్ లైట్ క్రాస్ చేస్తే రూ.2,000 జరిమానా వసూలు చేయనున్నారు.
     

మరిన్ని వార్తల కోసం..

యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై ఉత్కంఠ

స్పైస్ జెట్ పై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు