మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాలను ఆదుకోండి

మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాలను ఆదుకోండి

హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూళ్లలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన 27 మంది టీచర్ల కుటుంబాలను ఆదుకోవాలని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ )రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన, మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.

మోడల్ టీచర్లకు కారుణ్య నియామకాలు లేకపోవడంతో.. వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డు, మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు చేయాలని కోరారు. 9 ఏండ్లుగా ఒకే స్కూల్ లో పనిచేస్తున్నామని..వెంటనే ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు చేపట్టాలని యాకమల్లు విజ్ఞప్తి చేశారు.